Heat Waves | లోక్సభ రెండోదశ ఎన్నికలు శుక్రవారం జరుగనున్నది. ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మరో వైపు ఎన్నికల రోజున ఎండలు ఉంటాయని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గురువారం భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన హెచ్చరికల ప్రకారం.. వేడిగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో రాగల ఐదురోజుల్ల వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో రెడ్ అలర్ట్, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
రెండో దశ ఎన్నికలు 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాల్లో జరునుండగా.. లక్షలాది మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎనిమిది, మధ్యప్రదేశ్లో 6, బీహార్, అస్సాంలో ఐదు, ఛత్తీస్గఢ్, పశ్చిమలో మూడు స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. అలాగే త్రిపుర, జమ్మూ కశ్మీర్లో ఒక్కో స్థానానికి, మణిపూర్లోనూ రెండోదశ పోలింగ్ జరుగనున్నది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 27-29 మధ్య ఒడిశాలో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. త్రిపుర, కేరళ, కోస్టల్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, మేఘాలయ, గోవాలో తేమ కారణంగా తీవ్రమైన వేడి ఉంటుందని పేర్కొంది.