Kenya | కెన్యాను ముంచెత్తిన భారీ వర్షాలు.. 38 మంది మృతి
Kenya | తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యా (Kenya)ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం ధాటికి ఇప్పటి వరకూ సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
Kenya | తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యా (Kenya)ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కెన్యాలోని చాలా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి (Deadly floods). ఈ వర్షం ధాటికి ఇప్పటి వరకూ సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ (Kenya Red Cross Society) ప్రతినిధులు తెలిపారు.
భారీ వర్షాలకు ఆ దేశంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా నివాస ప్రాంతాలకు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. సుమారు లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భారీ వర్షాలు దేశవ్యాప్తంగా కనీసం 23 కౌంటీలను ప్రభావితం చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read..
JDU Leader | నితీశ్ కుమార్ పార్టీ నేత దారుణ హత్య
Aadhaar PAN Link | మే 31కల్లా ఆధార్‌తో పాన్ లింక్ అవ్వాలి.. అలాగైతేనే చర్యలుండవ్: ఐటీ శాఖ
Summer | భానుడి భగభగ.. 28న రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఐఎండీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

