Tesla layoffs | ఈవీ దిగ్గజం కొలువుల కోత : 6 వేల మందిపై టెస్లా వేటు
Tesla layoffs | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. తాజాగా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
Tesla layoffs | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ఖర్చు తగ్గింపులో భాగంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సంస్థలూ ఎడాపెడా ఉద్యోగులను పీకిపారేస్తున్నాయి. విడతలవారీగా సంస్థలోని ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
టెక్సాస్, కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించాలని సంస్థ యోచిస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటం (declining sales), ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. జూన్ 14 నుంచి కాలిఫోర్నియాలో 3,332 మంది ఉద్యోగులను, టెక్సాస్‌లో 2,688 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. యూఎస్ కార్మిక చట్టాలకు అనుగుణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కాగా, గతవారం టెస్లా ప్రపంచవ్యాప్తంగా 10 శాతానికి పైగా ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుందని టెక్ పబ్లికేషన్ ఎలెక్ట్రిక్ వెల్లడించింది. కంపెనీ తదుపరి వృద్ధి దశకు సన్నద్ధమయ్యే క్రమంలో వ్యయ నియంత్రణ, ఉత్పాదకత పెంపు దిశగా తాము అన్ని అవకాశాలనూ పరిశీలించడం కీలకమని ఇంటర్నల్ మెమోలో సీఈవో ఎలాన్ మస్క్ పేర్కొన్నారని ఆ పబ్లికేషన్ తెలిపింది. అయితే, ఎంత మందిని తొలగిస్తారన్నది మాత్రం అప్పుడు వెల్లడించలేదు.
US రెగ్యులేటర్లతో దాఖలు చేసిన వివరాల ప్రకారం.. ఇటీవలే సంవత్సరాల్లో టెస్లా శ్రామిక శక్తి భారీగా పెరిగింది. 2021లో సంస్థలో ఉద్యోగుల సంఖ్య దాదాపు 100,000గా ఉండగా.. గతేడాది అంటే 2023 చివరినాటికి 140,000కు చేరింది.
Also Read..
Kangana Ranaut | దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపై ఆ అలలు కొనసాగుతాయ్ : కంగనా రనౌత్
US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

