Kangana Ranaut | దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపై ఆ అలలు కొనసాగుతాయ్ : కంగనా రనౌత్
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది.
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన నియోజకవర్గంతోపాటు ఇతర బీజేపీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తోంది.
తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ (Jodhpur) బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. సంప్రదాయ రాజస్థానీ తలపాగా ధరించి పార్టీ జెండా చేతపట్టి జోధ్‌పూర్‌లో మెగా రోడ్ షో (Mega Rally) నిర్వహించింది. ఈ ర్యాలీ ‘భారత్ మాతాకీ జై..’, ‘జై శ్రీరామ్..’ నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ‘ప్రజల్లో బీజేపీపై ప్రేమ, ఆప్యాయత కనిపిస్తున్నాయి. జోధ్‌పూర్ ప్రజలకు బీజేపీపై పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపైనా ఆ అలలు కొనసాగుతాయి’ అని కంగన వ్యాఖ్యానించింది.
మరోవైపు పాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత పీపీ చౌదరికి మద్దతుగా కంగన ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వారు నా వ్యక్తిత్వంపై దాడి చేశారు. కానీ నా సైన్యం ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. ఎందుకంటే నాలోనూ రాజస్థాన్ డీఎన్ఏ ప్రవహిస్తోంది’ అంటూ ధ్వజమెత్తింది.
బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే (Supriya Shrinate) సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కంగన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక చిత్రాల్లో అనేక విభిన్న పాత్రలను పోషించినట్లు రనౌత్ పేర్కొన్నది. రజ్జో చిత్రంలో వేశ్యగా చేశానని, తలైవా చిత్రంలో విప్లవ నేతగా చేసినట్లు తెలిపింది. మన కూతుళ్లను స్వేచ్ఛగా ఉంచాలని, ప్రతి మహిళను గౌరవించాలని రనౌత్ పేర్కొన్నది. అయితే కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే ఓ వీడియో ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చింది. తనకు తెలియకుండా తన అకౌంట్ నుంచి పోస్టు జరిగినట్లు ఆమె వివరించింది.
Also Read..
US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
Patanjali | మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి.. రెండు రోజుల్లో రెండోసారి
Gangs of Godavari | విశ్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్ టైం ఫిక్స్.!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

