SRH vs RCB : పదిహేడో సీజన్లో రికార్డులు బద్దలు కొడుతున్న సన్రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(1)ర్ నిరాశపరిచాడు. ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. విల్ జాక్స్ వేసిన తొలి ఓవర్లో బంతిని సరిగ్గా అంచనా వేయలేక కరన్ శర్మ చేతికి చిక్కాడు. మూడు పరుగులకు ఒక వికెట్ పడినా సన్రైజర్స్ స్కోర్ తగ్గలే.
ఓపెనర్ అభిషేక్ శర్మ(27)తన తరహాలో చెలరేగుతూ జాక్స్ ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. మరో ఎండ్లో మర్క్రమ్ 2 పరుగులతో ఆడుతున్నాడు. 3 ఓవర్లకు హైదరాబాద్ వికెట్ నష్టానికి రన్స్ కొట్టింది.