WhatsApp | వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకుండానే హెచ్డీ ఫొటోలు, ఫైల్స్ పంపొచ్చు..!
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ కంపెనీ వాట్సాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్ల ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ కంపెనీ వాట్సాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్ల ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫొటోలు, వీడియోలు, మీడియా తదితర ఫైల్స్ అన్నీ ఆఫ్లైన్లోనూ షేర్ చేసుకునే వెసులుబాటు కలుగనున్నది. ఈ ఫీచర్‌కు సంబంధించిన అప్డేట్ను వాట్సాప్ ఫీచర్స్‌ను ట్రాక్ చేసే వాబీటాఇన్ఫో తెలిపింది.
మొబైల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పంపే ఫైల్స్ సైతం ఎన్‌క్రిప్ట్ చేయబడుతాయని.. తద్వారా సెక్యూరిటీ ఉంటుందని నివేదిక పేర్కొంది. కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని సైతం రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. విజయవంతమైతే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇంటర్నెట్ను వినియోగించకుండా ఫైల్స్‌ను షేర్ చేసేందుకు బ్లూటూత్, షేర్ఇట్, నియర్‌బై షేర్ అప్లికేషన్స్‌తో ఫైల్స్‌ను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదే తరహాలోనే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ యాప్‌ను తీసుకురాబోతున్నది. ఈ ఫీచర్ ఎనేబల్ చేసుకోవాలంటే వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు వాట్సాప్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై సైతం పని చేస్తున్నది. చాట్లిస్ట్లో ఫేవరెట్స్ ఆప్షన్‌ను తీసుకురాబోతున్నది. ఇందులో యూజర్లకు తమకు ఇష్టమైన వ్యక్తులను అందులో యాడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దాంతో తరచూ చాట్చేసే వారితో పాటు కాంటాక్ట్స్ మొత్తం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

