WhatsApp | తేలిగ్గా ఫోటోలూ వీడియోల షేరింగ్ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్.. నెట్ వర్క్ లేకున్నా పంపొచ్చు..!
WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే సౌకర్యం అందుబాటులోకి తేనున్నది.
WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన ప్లాట్ ఫామ్‌ను ఆల్ ఇన్ వన్ సేవలకు కేంద్రంగా రూపొందించడానికి కసరత్తు చేస్తున్నది. అందుకోసం అనుక్షణం తన కస్టమర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్ తెచ్చిన వాట్సాప్.. తాజాగా ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే సౌకర్యం అందుబాటులోకి తేనున్నది. అంటే ఇక ముందు నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా వాట్సాప్ ద్వారా ఇతరులకు డాక్యుమెంట్లు షేర్ చేయొచ్చు.
నెట్ వర్క్ లేకున్నా బ్లూటూత్ సాయంతో షేర్ ఇట్, నియర్ బై షేర్ వంటి యాప్స్ ద్వారా ఫోటోలు, సినిమాలు పంపుతారు. ఇదే సేవలు వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్నది. అదే జరిగితే ఫోటోలు, వీడియోలు, కీలక డాక్యుమెంట్లు పంపడానికి మరో యాప్ వాడాల్సిన అవసరం లేదు. అంతే కాదు.. మరింత వేగంగా, సురక్షితంగా డాక్యుమెంట్లను పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగ పడతుంది. వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంట వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫోటోల గ్యాలరీ యాక్సెస్ వంటి పర్మిషన్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మకంగా బీటా యూజర్లు పరీక్షిస్తున్నారు. త్వరలో వాట్సాప్ యూజర్లందరికీ వినియోగంలోకి రానున్నది.
ఇక చాట్ లిస్టులో ఫేవరెట్ అనే ఆప్షన్ కూడా వాట్సాప్ జోడించబోతున్నది. ఇందులో మీకు ఇష్టమైన వ్యక్తులను చేర్చుకుంటే, నిత్యం మీరు చాట్ చేసే వారి కోసం, నచ్చిన వారి కాంటాక్ట్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరంలేదు. ఈ ఫీచర్ కూడా టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలో బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వాబీటా తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

