Vivo Y200i |వివో నుంచి మిడ్ రేంజ్ పోన్ వివో వై200ఐ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Vivo Y200i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై200ఐ (Vivo Y200i) ఫోన్ను శనివారం చైనాలో ఆవిష్కరించింది.
Vivo Y200i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై200ఐ (Vivo Y200i) ఫోన్ను శనివారం చైనాలో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆర్జిన్ ఓఎస్ 4 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ గ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ తో వస్తున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.72 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ డిస్ ప్లే ఉంటది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ పోర్ట్ ఉంటది. అయితే, భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
వివో వై200ఐ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.18,800 (1599 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.21,200 (1799 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23,500 (1999 చైనా యువాన్లు) పలుకుతుంది. గ్లాసియర్ వైట్, స్టారీ నైట్, వాస్ట్ సీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 27 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
వివో వై200ఐ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆర్జిన్ ఓఎస్ 14 స్కిన్ వర్షన్ మీద పని చేస్తుంది. 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080 x 2408 పిక్సెల్స్ రిజొల్యూషన్) ఎల్సీడీ స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఉంటుంది.
వివో వై200ఐ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఉంటది. స్టీరియో స్పీకర్లతో వస్తున్న వివో వై200ఐ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

