అమరావతి : ఏపీలో రౌడియిజం పెరిగిపోయిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి చంద్రబాబుతో కలిసి ఉమ్మడి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యువత తలుచుకుంటే మార్పు సాధ్యమవుతుంది. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కూటమి(Allaince) ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఇసుకను మాఫీయా వల్ల అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో ఉందని , డ్యామ్‌లో ఇసుక తోడేయడం వల్ల 39 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలను ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న వైఎస్ జగన్ (YS Jagan) క్లాస్‌రూం గురించి మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాజంపేట ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తామని, ప్రజలంతా భయపడి ఉండకుండా దైర్యంగా బయటకు వచ్చి ఓటు వేసి జగన్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని పిలుపునిచ్చారు.