ఒకే కొలువులో 65 సంవత్సరాలు
జపాన్‌లోని సుంకో ఇండస్ట్రీస్ కార్యాలయం (టోక్యో)లో ఆఫీస్ మేనేజర్‌గా పనిచేస్తున్న యసుకో తమకి అయిదేళ్ల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కురాలైన ఆఫీస్ మేనేజర్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
‘ఈ రోజు వృథా చేసుకున్నావంటే నీకు రేపు లేనట్టే’ అని చెప్పే జపాన్ బామ్మ ‘యసుకో తమకి’ ఉద్యోగులకే కాదు పనిని ప్రేమించేవారందరికీ ఆదర్శం. అందుకే ఆమె పనిలో విశ్రమించడానికి ఇష్టపడలేదు. విరమణ లేకుండా వృద్ధాప్యంలోనూ హుషారుగా పనిచేస్తూ రికార్డులకెక్కింది. ఒకే కంపెనీలో ఒకే కొలువులో 65 సంవత్సరాలపాటు పనిచేసిన ఈ బామ్మ ‘ఒల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’గా గిన్నిస్ రికార్డు సాధించింది.
జపాన్‌లోని సుంకో ఇండస్ట్రీస్ కార్యాలయం (టోక్యో)లో ఆఫీస్ మేనేజర్‌గా పనిచేస్తున్న యసుకో తమకి అయిదేళ్ల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కురాలైన ఆఫీస్ మేనేజర్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ కార్యాలయంలో 1956లో ఆమె ఉద్యోగంలో చేరింది. ఆఫీస్ మేనేజర్‌గా అకౌంటెంట్ విధులు నిర్వర్తించేది. ఆ ఉద్యోగంలో చేరినప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. ఉద్యోగుల జీతాలు, బోనస్‌లు లెక్కించడం, వాటిని ఉద్యోగులకు చెల్లించడం ఇవన్నీ ఆమె బాధ్యతలు. అలాగే కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ చెల్లింపుల లెక్కలూ చూసేది. అలా ఆమె ఉద్యోగ జీవితం అకౌంటెంట్‌గా అక్కడ మొదలైంది. ఆ తర్వాత అదే కెరీర్లో దశాబ్దాలపాటు పనిచేసి ప్రపంచంలో మరెవరూ ఒకే కంపెనీలో, ఒకే బాధ్యతల్లో పని చేయనంతకాలం పనిచేసింది.
సుంకో ఇండస్ట్రీస్‌లో 65 సంవత్సరాల పాటు ఆఫీస్ మేనేజర్‌గా పనిచేసిన ఆమె సేవలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఆమెను ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్‌గా ప్రకటించింది. ఈ రికార్డులకు ఎక్కే నాటికీ ఆమె ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉంది. అప్పటికి ఆమె వయసు 90 సంవత్సరాల 174 రోజులు. ఒకే ఉద్యోగంలో అత్యధిక కాలం పనిచేసిన, అత్యధిక వయసులో ఆఫీస్ మేనేజర్ విధులు నిర్వర్తించిన ఉద్యోగినిగా గుర్తింపు సాధించింది. ఒకే కంపెనీలో, ఒకే కొలువులో 65 సంవత్సరాల ఎనిమిది నెలలపాటు పని చేయడం మాటలా?! వారానికి అయిదు రోజులు ఉద్యోగానికి వెళ్లి, ప్రతి రోజూ ఏడున్నర గంటలపాటు డ్యూటీ చేసింది. అలా ఆమె తన జీవితాన్ని ఒక ఆఫీస్‌గా మార్చేసుకుంది. ఈ జపాన్ బామ్మ ఇటీవలే ఉద్యోగం మానేసిందట. తొంబై ఆరేళ్ల వయసులో విశ్రాంత జీవితానికి ఇష్టపడ్డది!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

