Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Kareena Kapur | బాలీవుడ్ నటి (Bollywood Actress) కరీనాకపూర్ (Kareena Kapur) ఎప్పుడూ స్టైల్‌గా కనిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆమె ఎక్కడ కనిపించినా తన ఫ్యాషన్ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తాజాగా సింగపూర్ (Singapur) లో జరిగిన ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్‌కు ఆమె హాజరయ్యారు. ఆ సందర్భంలో ఆమె ధరించిన దుస్తుల కంటే గూడా ఆమె వేసుకున్న ఓ హ్యాండ్‌బ్యాగ్ (Hand Bag) అందరి దృష్టినీ ఆకర్షించింది.
Kareena Kapur : బాలీవుడ్ నటి (Bollywood Actress) కరీనాకపూర్ (Kareena Kapur) ఎప్పుడూ స్టైల్‌గా కనిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆమె ఎక్కడ కనిపించినా తన ఫ్యాషన్ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తాజాగా సింగపూర్ (Singapur) లో జరిగిన ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్‌కు ఆమె హాజరయ్యారు. ఆ సందర్భంలో ఆమె ధరించిన దుస్తుల కంటే గూడా ఆమె వేసుకున్న ఓ హ్యాండ్‌బ్యాగ్ (Hand Bag) అందరి దృష్టినీ ఆకర్షించింది.
ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ‘హెర్మెస్’ కు చెందిన ఈ బ్యాగ్ ధర అక్షరాలా రూ.13 లక్షలకు పైనేనట. మరి ఈ బ్యాగ్‌లో అంత ప్రత్యేకత ఏముంది..? రీసేల్ మార్కెట్లో ఎంత పలుకుతోంది..? అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం.. కరీనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సింగపూర్ పర్యటనకు సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. కారులో కూర్చుని వెనుక సింగపూర్ అందమైన స్కైలైన్ కనిపించేలా ఫొటోకు పోజిచ్చారు. తెల్లటి దుస్తులు, బ్రౌన్ జాకెట్, సిల్క్ స్కార్ఫ్‌తో స్టైలిష్‌గా కనిపించారు.
అయితే ఆమె చేతిలోని హ్యాండ్‌బ్యాగ్ మాత్రం ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. కరీనా చేతిలో ఉన్నది హెర్మెస్ కెల్లీ 25 మోడల్ బ్యాగ్‌గా గుర్తించారు. ఇది టోగో లేదా ఎప్సమ్ లెదర్‌తో తయారవుతుంది. గోల్డ్ ఫినిషింగ్ హార్డ్‌వేర్ దీని ప్రత్యేకత. బ్యాగ్‌కు ఆండ్రాయిడ్ ఆకారపు చార్మ్‌ను కూడా జతచేశారు. చిన్న సైజులో ఉన్నప్పటికీ లగ్జరీ ఫ్యాషన్ ప్రపంచంలో ఈ మోడల్‌కు మంచి గుర్తింపు ఉన్నది. సోథెబీస్ వెబ్సైట్ వివరాల ప్రకారం.. 2026లో అమెరికాలో హెర్మెస్ కెల్లీ బ్యాగ్‌ల ధరలు 3.8 శాతం నుంచి 8.9 శాతం వరకు పెరిగాయి.
ఈ మోడల్ ప్రారంభ ధర 13,700 డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.13.25 లక్షలు. అంటే ఓ ఖరీదైన కారు ధరకు దగ్గరగా ఈ బ్యాగ్ విలువ ఉంటుందన్నమాట. మాడిసన్ అవెన్యూ కౌచర్ వెబ్సైట్లో హెర్మెస్ కెల్లీ సెల్లియర్ 25 బ్యాగ్ ఒకటి 36,500 డాలర్లకు లిస్ట్ అయింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.35.32 లక్షలు. ఇక కరీనా తన లుక్‌ను తెల్లటి ప్యాంటు, బాడీసూట్, బ్రౌన్ జాకెట్‌తో పూర్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

