Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Huge Pumpkin | గుమ్మడికాయ (Pumpkin) బరువు మహా అయితే మూడు నాలుగు కిలోలు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 10, 12 కిలోల బరువు కూడా ఉండవచ్చు. మరీ అసాధారణ పరిస్థితుల్లో అయితే 30, 40 కేజీల గుమ్మడికాయలు కూడా కాయవచ్చు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ రైతు (Britain Farmer) మాత్రం ఏకంగా 1,295 కేజీల గుమ్మడికాయను పండించాడు.
Huge Pumpkin : గుమ్మడికాయ (Pumpkin) బరువు మహా అయితే మూడు నాలుగు కిలోలు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 10, 12 కిలోల బరువు కూడా ఉండవచ్చు. మరీ అసాధారణ పరిస్థితుల్లో అయితే 30, 40 కేజీల గుమ్మడికాయలు కూడా కాయవచ్చు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ రైతు (Britain Farmer) మాత్రం ఏకంగా 1,295 కేజీల గుమ్మడికాయను పండించాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ప్రపంచంలోనే అత్యంత బరువైన గుమ్మడికాయను పండించి రైతుగా గిన్నిస్ రికార్డు (Guinnes Record) ల్లోకి ఎక్కాడు.
హ్యాంప్‌షైర్‌కు చెందిన ఇయాన్ ప్యాటన్ పండించిన ఈ భారీ గుమ్మడికాయ ఏకంగా 1,295.8 కిలోల బరువు తూగింది. ఈ అద్భుతమైన ఫీట్‌తో గత ఏడాది తానే నెలకొల్పిన రికార్డును ప్యాటన్ స్వయంగా బద్దలుకొట్టాడు. అక్టోబర్ 3న యూకేలోని బెర్క్‌షైర్‌లో జరిగిన ‘వార్గ్రేవ్ నర్సరీ జెయింట్ వెజిటబుల్ వెయ్-ఆఫ్’ పోటీల్లో ఈ గుమ్మడికాయను ప్రదర్శించారు. అక్కడ దీని బరువును తూచి.. ‘గ్రేట్ పంప్కిన్ కామన్వెల్త్’ అధికారులు కొత్త ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించారు.
ఈ గుమ్మడికాయ బరువు తెల్ల ఖడ్గమృగం బరువుకంటే ఎక్కువని అధికారులు పేర్కొనడం దాని పరిమాణానికి నిదర్శనం. ఈ భారీ గుమ్మడికాయకు ‘ది జంగిల్ బుక్‌లోని నల్ల చిరుతపులి పాత్ర స్ఫూర్తితో ‘బఘీరా’ అని ముద్దుగా పేరుపెట్టారు. అయితే ఇయాన్ ప్యాటన్ ఇలాంటి రికార్డు సృష్టించడం ఇది మొదటిసారి కాదు. 2025లో తన కవల సోదరుడు స్టువర్ట్తో కలిసి పండించిన 1,278.8 కిలోల ‘మగుల్’ అనే గుమ్మడికాయతో ఆయన రికార్డు నెలకొల్పారు.
ఇప్పుడు ఆ రికార్డును ఆయనే అధిగమించారు. అంతేకాదు ఈ పోటీకి రెండు వారాల ముందు ‘బలూ’ అనే మరో గుమ్మడికాయను ప్రదర్శించగా 1,258 కిలోల బరువు తూగింది. అప్పటికి అదే రెండో అతిపెద్ద గుమ్మడికాయగా నిలిచింది. ‘బఘీరా’ ను పెంచడానికి తీవ్రంగా శ్రమించానని ఇయాన్ ప్యాటన్ తెలిపారు. దాదాపు రెండు నెలలపాటు రోజూ ఆరు గంటల సమయం తోటలోనే గడిపానని, ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజూ భారీగా నీరు అందించాల్సి వచ్చిందని చెప్పారు.
భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద గుమ్మడికాయను పండించాలనే ఆసక్తిని ఆయన వ్యక్తంచేశారు. కాగా రికార్డు సృష్టించిన ఈ గుమ్మడికాయను అక్టోబర్ చివరి వరకు సౌతాంప్టన్ సమీపంలోని సన్నీఫీల్డ్స్ ఫామ్‌లో ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచనున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
ట్రెండింగ్ వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

