Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
జహీరాబాద్ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు ప్రపంచ సుడోకు(Sudoku) ఛాంపియన్ షిప్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
జహీరాబాద్, అక్టోబర్ 11: జహీరాబాద్ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు ప్రపంచ సుడోకు(Sudoku) ఛాంపియన్ షిప్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. కోల్‌కతాలో ఈ నెల 11 నుంచి 18 వరకు జరిగే 19వ ప్రపంచ సుడోకు ఛాంపియన్ షిప్, 33వ ప్రపంచ పజిల్ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్చల్మ గ్రామానికి చెందిన మాజీ మంత్రి దివంగత ఎం. బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి, మనుమడు కార్తీక్ రెడ్డి పాల్గొననున్నారు.
జైపాల్ రెడ్డి గత రెండు దశాబ్దాలుగా సుడోకు పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2008 నుంచి అంతర్జాతీయ వేదికపై పోటీపడుతున్న ఆయన జట్టు పరంగా 5వ స్థానం, వ్యక్తిగతంగా 37వ ర్యాంక్ సాధించారు. ఈసారి టీమిండియాను టాప్-5లో నిలపడం, వ్యక్తిగతంగా టాప్-40లో ర్యాంక్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జపాన్, చైనాతో పాటు ఐరోపా, అమెరికా దేశాల నుంచి గట్టి పోటీ ఉంటుందన్నారు.
ఆయన కుమారుడు కార్తీక్ రెడ్డి 2015లో అండర్-15 విభాగంలో పోటీల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతూనే సుడోకులో రాణిస్తున్నారు. 2023 నుంచి తండ్రితో సమానంగా ప్రతిభ కనబరుస్తున్నారు. ముంబైలో జరిగిన టైమ్స్ సుడోకు ఛాంపియన్ షిప్ లో తండ్రీకొడుకులు కేవలం 30 సెకన్ల తేడాతో మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. ప్రపంచ వేదికపై దేశానికి మంచి ఫలితాలు తీసుకురావడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

