Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Teacher Play Tabla On Student's Shaved Head | ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి గుండుపై తబలా వాయించాడు. బిగ్గరగా నవ్వుతూ వీడియోను రికార్డ్ చేయించాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై విమర్శలతో పాటు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.
లక్నో: ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి గుండుపై తబలా వాయించాడు. బిగ్గరగా నవ్వుతూ వీడియోను రికార్డ్ చేయించాడు. ఆ టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై విమర్శలతో పాటు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. (Teacher Play Tabla On Student’s Shaved Head) ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సైఫాయి బ్లాక్‌లోని బిరౌలి ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా దినేష్ కుమార్ మాథుర్ పని చేస్తున్నారు. అయితే గుండు చేయించుకున్న ఒక విద్యార్థిని ఆయన అవహేళన చేశారు. తరగతి గదిలోని కుర్చీలో ఆ టీచర్ కూర్చోగా ఆయన చుట్టూ నేలపై విద్యార్థులు కూర్చొని ఉన్నారు.
కాగా, తన కుర్చీ ముందు నేలపై కూర్చొన్న ఆ విద్యార్థి గుండును తబలా మాదిరిగా టీచర్ దినేష్ కుమార్ మాథుర్ భావించారు. సరదాగా చేతులతో ఉత్సాహంగా బాలుడి గుండుపై వాయిస్తూ బిగ్గరగా నవ్వారు. విద్యార్థులు కూడా ఇది చూసి నవ్వుల్లో మునిగిపోయారు. ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఆ టీచరే స్వయంగా తన ఫేస్బుక్ ప్రొఫైల్‌లో అప్లోడ్ చేశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఉపాధ్యాయుడి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే విద్యాశాఖకు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఉపాధ్యాయుడు దినేష్ కుమార్ మాథుర్‌ను తక్షణం సస్పెండ్ చేశారు.
#VIRAL: Teacher seen playing tabla on a student’s head, laughing and dancing.
Teacher suspended!
📍Etawah, Uttar Pradesh https://t.co/goTIqIl0K5
— Karan Singh / करन सिंह (@Journo_Karan) October 9, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

