Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Solar Eruption | సూర్యుడి నుంచి వెలువడ్డ శక్తిమంతమైన కణాల మేఘాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. అక్టోబర్ 11న ఈ సౌర తుఫాను (Solar Eruption) భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సౌరతుఫాను ప్రభావంతో ఉపగ్రహాలు (Satellites), రేడియో సంకేతాలు, నావిగేషన్ వ్యవస్థల (Navigation systems) పై కొంత ప్రభావం పడవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Solar Eruption : సూర్యుడి నుంచి వెలువడ్డ శక్తిమంతమైన కణాల మేఘాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. అక్టోబర్ 11న ఈ సౌర తుఫాను (Solar Eruption) భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సౌరతుఫాను ప్రభావంతో ఉపగ్రహాలు (Satellites), రేడియో సంకేతాలు, నావిగేషన్ వ్యవస్థల (Navigation systems) పై కొంత ప్రభావం పడవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే ఈ తుఫాను తీవ్రత ఎంత ఉంటుంది..? భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్యుడి నుంచి భారీ మొత్తంలో శక్తి, అతి చిన్న కణాలు అంతరిక్షంలోకి విడుదలవుతాయి. వీటిలో కొన్ని భూమివైపు దూసుకొస్తాయి. ఈ కణాల మేఘాలు భూమిని చేరినప్పుడు మన గ్రహాన్ని చుట్టుముట్టిన అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు వస్తాయి. ఈ పరిణామాన్నే ‘భూ అయస్కాంత తుఫాను’ (జియోమాగ్నెటిక్ స్టార్మ్) అంటారు. సౌర తుఫానులన్నీ ఒకే స్థాయిలో ఉండవు. వీటి తీవ్రతను ఎన్ఓఏఏ ఐదు స్థాయిల్లో వర్గీకరిస్తుంది.
స్వల్ప స్థాయి తుఫాను, మధ్యస్థాయి తుఫాను, బలమైన తుఫాను, తీవ్రమైన తుఫాను, అత్యంత తీవ్ర తుఫాను అని ఐదు వర్గాలుగా ఈ సౌర తుఫానులను వర్గీకరించారు. అయితే ప్రతి సౌర తుఫాను భూమిపై భారీ నష్టం కలుగుజేస్తుందని చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
రేపు ఏం జరుగుతుంది..?
శాస్త్రవేత్తల వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 7, 8 తేదీల్లో సూర్యుడి నుంచి రెండు భారీ కణ మేఘాలు విడుదలయ్యాయి. ఇవి భూమివైపు ప్రయాణిస్తున్నాయి. రెండో మేఘం వేగంగా కదులుతుండటంతో తొలి మేఘం భూమిని చేరేలోపు రెండో మేఘం దానితో కలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెండు మేఘాల రాక నేపథ్యంలో అక్టోబర్ 11న మధ్యస్థాయి జీ2 భూ అయస్కాంత తుపాను ఏర్పడవచ్చని అంచనా వేశారు.
అయితే అవి భూమి అయస్కాంత క్షేత్రంతో ఎలా ప్రభావితమవుతాయన్న దానిపైనే తుఫాను తీవ్రత ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రస్తుత అంచనాలను తుది నిర్ణయంగా భావించలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. సౌర తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్న ప్రాంతాలు భూమి ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలే. అక్కడ విద్యుత్ వ్యవస్థల్లో వోల్టేజీ మార్పులు రావొచ్చు. ఉపగ్రహాలను నిర్వహించే సంస్థలు వాటి పనితీరును పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు చేయాల్సి రావచ్చు.
కొన్నిచోట్ల రేడియో సంకేతాలు బలహీనపడే అవకాశం ఉంది. ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల కచ్చితత్వం కూడా తాత్కాలికంగా ప్రభావిత కావచ్చు. అయితే జీ2 స్థాయి సౌర తుఫాను వస్తుందన్న అంచనా మాత్రమే చూసి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ స్తంభిస్తుందని, లేదా విద్యుత్ సరఫరా ఆగిపోతుందని చెప్పలేమన్నారు. సౌర తుఫానుల సమయంలో ఆకాశంలో రంగురంగుల కాంతులు కనిపించే అవకాశం ఉంటుందని, వాటిని ‘అరోరాలు’ అంటారని చెప్పారు.
ఇదిలావుంటే ప్రస్తుత అంచనా ప్రకారం భారత్‌లో సాధారణ ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావంపడే సూచనలు లేవు. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు వస్తాయని, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోతాయని చెప్పడానికి ఆధారాలు లేవు. అలాగే మన దేశంలో విస్తృతంగా అరోరాలు కనిపిస్తాయని కూడా అంచనా లేదు. కాబట్టి అక్టోబర్ 11న సౌర తుఫాను వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అది భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

