Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Girl Clings Onto Truck's Bumper | యువతి నడుపుతున్న స్కూటీని ఒక లారీ ఢీకొట్టింది. అయితే ఆమె తక్షణం స్పందించింది. వెంటనే లారీ బంపర్‌ను గట్టిగా పట్టుకుని వేలాడింది. ఆ యువతి ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: యువతి నడుపుతున్న స్కూటీని ఒక లారీ ఢీకొట్టింది. అయితే ఆమె తక్షణం స్పందించింది. వెంటనే లారీ బంపర్‌ను గట్టిగా పట్టుకుని వేలాడింది. ఆ యువతి ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Girl Clings Onto Truck’s Bumper) మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 8న శ్రీరాంపూర్‌లోని ప్రధాన రోడ్డు మార్గంలోకి ఇసుక లారీ వేగంగా దూసుకువచ్చింది. డ్రైవర్ వేగాన్ని తగ్గించకపోగా హారన్ కూడా మోగించలేదు. మలుపు వద్ద అకస్మాత్తుగా కుడివైపు వెళ్లేందుకు ఆ లారీ డ్రైవర్ ప్రయత్నించాడు.
కాగా, ఆ సమయంలో ఒక యువతి నడుపుతున్న స్కూటీని ఆ లారీ ఢీకొట్టింది. అయితే ఆమె తక్షణమే స్పందించింది. లారీ బంపర్‌ను గట్టిగా పట్టుకుని గాలిలోకి వేలాడి నేలపై నిల్చొంది. ప్రమాదం నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నది. స్కూటీని లారీ ఢీకొట్టిన తీవ్రతకు ఎగిరిపడకుండా లేదా ఆ వాహనం కింద పడకుండా ఆ యువతి జాగ్రత్త పడింది. తద్వారా ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత లేచి నడుచుకుంటూ దూరంగా వెళ్లింది.
మరోవైపు ఈ ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ కిందకు దిగాడు. ఢీకొట్టిన స్కూటీని అతడు పరిశీలించాడు. ఆ యువతిదే తప్పు అన్నట్లుగా వాదించేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ఆ డ్రైవర్ లారీని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే ఇసుక లోడ్‌తో వెళ్తున్న ఆ లారీకి నంబర్ ప్లేట్ లేకపోవడాన్ని స్థానికులు గమనించారు. ఆ ప్రాంతంలో అనుమతులు లేకుండా అతివేగంగా ఇసుక లారీలు ప్రయాణించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, ప్రమాదం నుంచి యువతి తృటిలో తప్పించుకున్న సంఘటన ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 GIRL GRABS TRUCK BUMPER AFTER SCOOTER COLLISION IN MAHARASHTRA
CCTV footage from Belapur Road in Shrirampur, Maharashtra shows a sand-laden truck turning into the path of a girl riding a scooter.
The truck hits the scooter and the girl grabs its front bumper to avoid being run over by the heavy vehicle.
The incident took place on October 8.
🎥 CCTV Footage
#Maharashtra
— contentkikamii (@contentkikamii) October 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

