CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
CJP : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపినిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు వీరిని జంతర్ మంతర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు.
CJP : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపినిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద రెండో రోజు నిరసనలో పాల్గొనాలని భావించి సీజేజీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే(Abhijit Dipke) సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఢిల్లీలో దిగగానే దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాతో పాటు పలువురిని విమానంలోనే మహిళా పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా అదే దూకుడు కనబరిచిన ఢిల్లీ పోలీసులు వీరిని జంతర్ మంతర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఓట్ చోరీలో కేంద్రం ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో భారీగా ఓటర్ల తొలగింపును నిరసిస్తూ.. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాకు పిలుపునిచ్చిన సీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Delhi: CJP leader Abhijeet Dipke, Ashutosh Ranka, and Saurav Das produced before the Executive Magistrate at Delhi Cantt Police Station after preventive arrest. https://t.co/wL1nt52zJA
— ANI (@ANI) October 11, 2026
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ తరహాలోనే జంతర్ మంతర్ వద్ద సీఈసీ వైదొలగాలనంటూ భారీ ఆందోళనకు సిద్ధమైన సీజేపీ నాయకత్వాన్ని ఢిల్లీలో అడుగుపెట్టకముందే అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను విమానంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆదివారం కూడా ఈ ముగ్గురిని తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. అయితే.. నిన్న అరెస్టైన 3వేల మందిని రాత్రి పోలీసులు విడుదల చేశారు. కానీ.. దీప్కే, దాస్, రంకాలను మాత్రం ముందస్తు అరెస్ట్ పేరుతో జంతర్ మంతర్ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. అనంతరం వీరిని ఢిల్లీలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
ఈ నాయక త్రయం గైర్హాజరీలో తొలి రోజు ఆందోళనలకు అజింక్యా షిండే నేతృత్వం వహించారు. సర్ ప్రక్రియ కారణంగా13 కోట్ల ఓట్లలో ఏర్పడిన అవకతవకలను సరి చేయాలని నిరసనలో పాల్గొన్న సీజేపీ నాయకులు, మద్దతుదారులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

