శనివారం 16 జనవరి 2021
National - Dec 21, 2020 , 10:53:01

దేశంలో కొత్తగా 24 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 24 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 26 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోద వగా, తాజాగా 24 వేల మంది కరోనా బారినపడ్డారు. ఈరోజు నమోదైన కేసులు నిన్నటికంటే 8.5 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,337 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,00,55,560కు చేరింది. ఇందులో 3,03,639 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా 25,709 మంది మహమ్మారి భారినుంచి బయటపడటంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 96,06,111కు చేరింది. మరో 1,45,810 మంది బాధితులు ఈ వైరస్‌ ప్రభావంతో మరణించారు. ఇందులో నిన్న ఒక్కరోజే 333 మంది మృతిచెందారు. 

కాగా, దేశవ్యాప్తంగా నిన్నటివరకు 16,20,98,329 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది. ఇందులో డిసెంబర్‌ 20న 9,00,134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.