Vidya Vasula Aham | యువ నటులు శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విద్యా వాసుల అహం’(Vidya Vasula Aham). నేరుగా తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానున్న ఈ చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
ఇక ఈ టీజర్ గమనిస్తే.. ప్రస్తుత జనరేషన్లో పెళ్లైన జంటల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో.. అహం (ఇగో) కూడా అలానే కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొత్తగా పెళ్లయిన ఈ జంట తమ ఇగోని వదిలి కలిసి ఉంటారా.. అహంతో విడిపోతారా అనేది ఈ సినిమా స్టోరీ. ఫుల్ ఎంటర్టైనర్గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కల్యాని మాలిక్ సంగీతం అందిస్తున్నాడు.