Google Pixel 8a | భారత్ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ ఆవిష్కరణ.. రూ.13 వేల వరకూ డిస్కౌంట్లు..!
Google Pixel 8a | సెర్చింజన్ గూగుల్ (Google) తన గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Google Pixel 8a | సెర్చింజన్ గూగుల్ (Google) తన గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న గూగుల్ ఐ/ఓ ఈవెంట్లో గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ ఆవిష్కరించాల్సి ఉంది. కానీ మంగళవారం (మే 7) రాత్రి ఆవిష్కరించడంతో గూగుల్ తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లో బిల్ట్ ఇన్ జెమినీ ఏఐ (Gemini AI), గూగుల్ టెన్సార్ జీ3 చిప్సెట్ ప్రాసెసర్ ఉంటాయి.
గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ కంటే గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ ధర ఎక్కువ. గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ ఆవిష్కరించినప్పుడు దాని ధర రూ.43,999 కాగా, తాజా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ ధర రూ.52,999లకే లభ్యం అవుతుంది. కానీ రూ.39,999లకే ఈ ఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లు విక్రయిస్తారు. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ద్వారా మీరు ఫోన్ రిజర్వ్ చేసుకోవచ్చు. మే 14 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం అవుతాయి. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై ప్రీ-ఆర్డర్ రిజర్వ్ చేసుకుంటే ఫోన్ ధర తగ్గుతుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్ల ఎక్స్చేంజ్ కింద రూ.9000 ఆఫర్ కూడా ఉంది. ఇవి రెండు కలిపితే గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ రూ.39,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్‌తోపాటు పిక్సెల్ బడ్స్ ఏ-సిరీస్ రూ.999లకే కొనుక్కోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ నాలుగు రంగులు – అల్లోయ్, బే, ఒబ్సిడియన్, పోర్సెలియాన్ రంగుల్లో లభిస్తుంది. రెండు స్టోరేజీ వేరియంట్ల (128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ) లో అందుబాటులో ఉంటుంది. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.52,999, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.59,999లకు లభ్యం అవుతుంది.
గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 430పీపీఐ, 1080×2400 పిక్సెల్స్ రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.1 అంగుళాల ఓలెడ్ యాక్చువా స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటది. గూగుల్ పిక్సెల్ 7ఏ కంటే గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ యాక్చువా డిస్ ప్లే 40 శాతం బ్రైట్‌గా ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ గూగుల్ టెన్సార్ జీ3 (Google Tensor G3) చిప్ సెట్, టైటాన్ ఎం2 (Titan M2) సెక్యూరిటీ కో ప్రాసెసర్ ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా, 13-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ విత్ లార్జ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటది. గూగుల్ బిల్ట్-ఇన్ ఏఐ అసిస్టెంట్ ‘జెమినీ’తో వస్తుంది. వివిధ అంశాలపై టైప్ చేయడానికి, మాట్లాడటానికి, ఇమేజ్‌లు జత చేయడానికి ఇది ఉపకరిస్తుంది. 4492 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. రిటైల్ బాక్స్ తోపాటు చార్జర్ కూడా ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

