Brakes fail Vande Bharat travels | బ్రైక్స్ ఫెయిల్ అయిన వందే భారత్ రైలు 463 కిలోమీటర్లు ప్రయాణం.. దర్యాప్తునకు రైల్వే ఆదేశం
Brakes fail Vande Bharat travels | వందే భారత్ రైలుకు బ్రైకులు ఫెయిల్ అయ్యాయని లోకో పైలట్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ హెచ్చరికను రైల్వే సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఒక ఇంజిన్ ద్వారా రెండు రాష్ట్రాల మీదుగా 463 కిలోమీటర్ల దూరం ఆ వందే భారత్ రైలు ప్రయాణించింది. ఈ నేపథ్యంలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంపై దర్యాప్తునకు రైల్వే ఆదేశించింది.
న్యూఢిల్లీ: వందే భారత్ రైలుకు బ్రైకులు ఫెయిల్ అయ్యాయని లోకో పైలట్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ హెచ్చరికను రైల్వే సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఒక ఇంజిన్ ద్వారా రెండు రాష్ట్రాల మీదుగా 463 కిలోమీటర్ల దూరం ఆ వందే భారత్ రైలు ప్రయాణించింది. ఈ నేపథ్యంలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంపై దర్యాప్తునకు రైల్వే ఆదేశించింది. అక్టోబర్ 24న జార్ఖండ్‌లోని హతియా నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీకి ఒక గూడ్స్ రైలు ఇంజిన్ ద్వారా ఖాళీ కోచ్‌లు ఉన్న వందే భారత్ రైలును తరలించాలని రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రయాణమంతా ఆ వందే భారత్ రైలు కోచ్‌ల బ్రేకింగ్ వ్యవస్థను, దానిని లాగే లోకోమోటివ్ బ్రేకింగ్ వ్యవస్థతో అనుసంధానించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
కాగా, ఈ రెండు బ్రేకింగ్ వ్యవస్థలు సరిగ్గా అనుసంధానం జరిగిందా లేదా అన్నది నిర్ధారించడంలో రైల్వే సిబ్బంది విఫలమయ్యారు. దీంతో రాంచీ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, వందే భారత్ రైలు బ్రేకుల సామర్థ్యం సరిగా లేదని లోకోపైలట్ గుర్తించారు. సెక్షన్ కంట్రోలర్, ట్రాక్షన్ లోకోమోటివ్ కంట్రోలర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ వందే భారత్ రైలును అదే స్థితిలో ముందుకు వెళ్లడానికి రైల్వే అధికారులు అనుమతించారు. మురి స్టేషన్ నుంచి నడిపిన మరో లోకోపైలట్ కూడా ఆ వందే భారత్ రైలు కోచ్‌ల బ్రేకింగ్ పనితీరు సరిగా లేదని సంబంధిత కంట్రోలర్లకు తెలియజేశారు. బ్రేక్ పైపు ఒత్తిడిని తగ్గించడం ద్వారా బ్రేకులు వేయడం సాధ్యపడలేదని ఆయన ప్రత్యేకంగా నివేదించారు.
మరోవైపు బ్రేక్స్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పటికీ ఆ ఖాళీ వందే భారత్ రైలు రెండు రాష్ట్రాల మీదుగా 463 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దానిని లాగిన గూడ్స్ రైలు ఇంజిన్ బ్రేకుల ఆధారంగానే అది నడిచింది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌కు ఆ రైలు చేరుకున్న తర్వాత రైల్వే సిబ్బంది తనిఖీలో ఈ విషయం బయపడింది. కోచ్, వ్యాగన్ నిర్వహణ సిబ్బంది, సంబంధిత స్టేషన్లలోని సెక్షన్, ట్రాక్షన్ కంట్రోలర్లు, అలాగే హతియా నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ వరకు రైలును నడిపిన సిబ్బంది అంతా నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు.
అయితే ఇతర ప్యాసింజర్ రైళ్లు, రైలు ప్రయాణికులకు ప్రమాదం వాటిల్లే ముప్పు ఉన్న ఈ నిర్లక్ష్యంపై విచారణ జరుపాలని రాంచీ డివిజనల్ రైల్వే మేనేజర్‌ను కోరుతూ నవంబర్ 7న సౌత్ ఈస్టర్న్ రైల్వే ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 11న అస్సాంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడానికి ఇలాంటి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Brakes fail
- ignored
- orders
- Probe
RELATED ARTICLES
తాజా వార్తలు
Brakes fail Vande Bharat travels | బ్రైక్స్ ఫెయిల్ అయిన వందే భారత్ రైలు 463 కిలోమీటర్లు ప్రయాణం.. దర్యాప్తునకు రైల్వే ఆదేశం
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
Dhanush | మమ్ముట్టిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.. మెగాస్టార్‌పై ధనుష్ ప్రశంసలు!
Dear Astronaut | అంతరిక్షయాన కల నెరవేర్చేందుకు తండ్రి సాహసం.. ఆకట్టుకుంటున్న ‘డియర్ ఆస్ట్రోనాట్’ ట్రైలర్
Health tips | మీ డైట్లో బీట్రూట్ ఉంటే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

