Sweets | పండుగల సమయంలో స్వీట్లు, ఇతర ఆహారాలను అధికంగా తినొద్దంటే.. ఇలా చేయాలి..
పండుగ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో విందులు, వేడుకలు, రాత్రి వేళ పార్టీలతో సందడి నెలకొంటుంది. ఈ సందర్భంగా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, చిరుతిళ్లు అందుబాటులో ఉండడంతో చాలామంది తమ ఆహార నియమాలను, వ్యాయామ అలవాట్లను పక్కనపెట్టి ఎక్కువగా తింటుంటారు.
Sweets | పండుగ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో విందులు, వేడుకలు, రాత్రి వేళ పార్టీలతో సందడి నెలకొంటుంది. ఈ సందర్భంగా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, చిరుతిళ్లు అందుబాటులో ఉండడంతో చాలామంది తమ ఆహార నియమాలను, వ్యాయామ అలవాట్లను పక్కనపెట్టి ఎక్కువగా తింటుంటారు. అయితే పండుగను ఆనందిస్తూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వరుసగా విందులకు హాజరవుతున్నప్పటికీ ఆహార నియమాలు పాటించేందుకు కొన్ని సులభమైన చిట్కాలను వెల్లడించారు.
ఖాళీ కడుపుతో ఉండకూడదు..
విందుకు వెళ్లే ముందు ఖాళీ కడుపుతో ఉండకూడదని, ఇంటి నుంచే తగినంత ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. పెసరపప్పుతో చేసిన అట్లు, పెరుగు లేదా గుడ్డులోని తెల్లసొనతో బ్రెడ్ వంటి పదార్థాలు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండడంతోపాటు విందులో అతిగా తినకుండా ఉండవచ్చని చెబుతున్నారు. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ప్రతి పానీయం తర్వాత ఒక గ్లాసు నీటిని నిమ్మరసం కలిపి తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలో నీటి లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు.
పేగుల కదలికలను మెరుగుపరిచే ఆహారం..
రాత్రి పడుకునే ముందు నానబెట్టిన మెంతులు లేదా నీటిలో కలిపిన ఇసబ్గోల్ తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇసబ్గోల్ పేగుల కదలికలు సజావుగా సాగేందుకు సహాయపడుతుందని, మెంతులు ఇన్సులిన్ స్పందనను మెరుగుపరచడంలో తోడ్పడతాయని చెబుతున్నారు. అయితే వీటిని తీసుకునే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. పండుగ రోజున ఎక్కువగా తిన్నామని మరుసటి రోజు ఆహారం మానేయడం లేదా ఆకలితో ఉండడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేస్తున్నారు.
ప్రోటీన్లు, ఫైబర్ ముఖ్యం..
ఉదయం నిద్రలేవగానే తగినంత నీరు తాగి, ఆ తర్వాత ప్రొటీన్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్న అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందితే రోజంతా శక్తి నిలకడగా ఉంటుందని చెబుతున్నారు. పండుగ సమయంలో ప్రతి ఆహార పదార్థంలోని కేలరీలను లెక్కించుకోవడం కంటే వాటి నాణ్యత, తయారీలో ఉపయోగించే పదార్థాలపై దృష్టి పెట్టడం మంచిదని పేర్కొంటున్నారు. రోజంతా తగినంత నీరు తాగడం, వ్యాయామాన్ని కొనసాగించడం ద్వారా ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweets | పండుగల సమయంలో స్వీట్లు, ఇతర ఆహారాలను అధికంగా తినొద్దంటే.. ఇలా చేయాలి..
Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
Telugu Youth | ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అస్రిత్ దేవళ్ల ప్రతిభకు ప్రతిష్ఠాత్మక అవార్డు
Brakes fail Vande Bharat travels | బ్రైక్స్ ఫెయిల్ అయిన వందే భారత్ రైలు 463 కిలోమీటర్లు ప్రయాణం.. దర్యాప్తునకు రైల్వే ఆదేశం
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

