Boycott Polls | గుజరాత్‌లోని ఆ మూడు గ్రామాల్లో ఒక్క ఓటూ పడలేదు.. ఎందుకంటే..!
Boycott Polls | లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో భాగంగా మంగళవారం గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకుగాను 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. సూరత్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అక్కడ పోలింగ్ జరగలేదు. అయితే ఈ పోలింగ్ సందర్భంగా గుజరాత్‌లోని మూడు గ్రామాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు.
Boycott Polls : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో భాగంగా మంగళవారం గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకుగాను 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. సూరత్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అక్కడ పోలింగ్ జరగలేదు. అయితే ఈ పోలింగ్ సందర్భంగా గుజరాత్‌లోని మూడు గ్రామాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరికొన్ని గ్రామాల్లో చాలా తక్కువ మంది ఓటు వేశారు.
గుజరాత్‌లోని బీజీపీ ప్రభుత్వం ఆయా గ్రామాలకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆ గ్రామాల ప్రజలంతా పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటింగ్‌ను సంపూర్ణంగా బహిష్కరించిన గ్రామాల్లో బరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామం, సూరత్ జిల్లాలోని సనధారా గ్రామం, బనస్కాంత జిల్లాలోని భఖారీ గ్రామం ఉన్నాయి.
అదేవిధంగా జునాగఢ్ జిల్లాలోని భత్గమ్ గ్రామంలో , మహిసాగర్ జిల్లాలోని బదోలీ, కుంజర గ్రామంలో చాలా కొద్ది మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ గ్రామాల మధ్య నదిపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోనందుకు కొన్ని గ్రామాల వాళ్లు, తమ గ్రామాన్ని విభజించినందుకు నిరసనగా కొన్ని గ్రామాలవాళ్లు ఇలా ఓటింగ్‌ను బహిష్కరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

