Watch: కార్గో విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. రన్‌వేపై ఎలా ల్యాండ్ అయ్యిందంటే?
Cargo Plane | కార్గో విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయ్యింది. దీంతో విమానం ముందు భాగం రనేవేకు రాసుకోవడంతో మంటలు రాజుకున్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఆ విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అంకారా: కార్గో విమానం (Cargo Plane) ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయ్యింది. దీంతో విమానం ముందు భాగం రనేవేకు రాసుకోవడంతో మంటలు రాజుకున్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఆ విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికా పోస్టల్ కంపెనీ ఫెడెక్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానం బుధవారం ఉదయం పారిస్ నుంచి టర్కీకి చేరుకుంది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధం కాగా ల్యాండింగ్ గేర్ విఫలమైనట్లు పైలట్ గుర్తించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు ఈ విషయం చెప్పారు.
కాగా, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఆ విమానం ప్రయత్నించింది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే విమానం ముందు భాగం రన్‌వేకు రాసుకుంది. దీంతో మంటలు రాజుకున్నాయి. అయితే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఫైర్ కంట్రోల్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఫోమ్ వెదజల్లి మంటలు, పొగలను అదుపుచేశారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. విమాన సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు కార్గో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🇺🇸BOEING CARGO PLANE CRASHES ON ISTANBUL RUNWAY!
A Boeing 767 cargo plane crashed upon landing in Turkey after its landing gear failed. #Turkey
The plane attempting an emergency landing, smashing down into the runway and scraping its nose along the concrete.
The Airport… pic.twitter.com/3BK1XHp9OG
— WORLD AT WAR (@World_At_War_6) May 8, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

