లక్నో: ఒక ఆవు వందే భారత్ రైలు (Vande Bharat Train) కింద చిక్కుకున్నది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆవు వెనుక భాగం రైలు ఇంజిన్ ముందు ఇరుక్కుపోయింది. అయితే లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఆవు ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైలు పట్టాలపై ఆవు ఉండటాన్ని గమనించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అయినప్పటికీ వందే భారత్ రైలు ఇంజిన్ కింద ఆవు వెనుక భాగం చిక్కుకున్నది.
కాగా, వందే భారత్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ కిందకు దిగి ఆవు పరిస్థితిని గమనించాడు. ఆ తర్వాత రైలును మెల్లగా రివర్స్ డైరెక్షన్లో నడిపాడు. దీంతో ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకున్న ఆవు వెంటనే పైకి లేచింది. అక్కడి నుంచి అది వెళ్లిపోయింది. లోకో పైలట్ సకాలంలో ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆ ఆవు ప్రాణాలతో బయటపడింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#वंदे_भारत_एक्सप्रेस के आगे गाय आ गई, ड्राइवर के इमर्जेंसी ब्रेक लगाते-लगाते फिर भी आधी गाय ट्रेन नीचे आ गई, "और फंस गई!!
धन्यवाद ड्राइवर साहब, जय श्रीकृष्ण #viralvideo pic.twitter.com/tZB7nZUCRY
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 11, 2024