కొండాపూర్, మార్చి 12 : ఇంటింటికి బీఆర్ఎస్ జెండా, ఎజెండా చేరేలా ఎప్పటికప్పుడు ప్రత్యేక చొరవ చూపుతున్న శేరిలింగంపల్లి సీనియర్ నేత ,మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. నవతారెడ్డి స్వయంగా కేసీఆర్ చిత్రపటంతో రూపొందించిన గోడ గడియారాన్ని గురువారం కేటీఆర్ ఆవిష్కరించారు.
నూతనంగా ఏర్పడిన చందానగర్, దీప్తిశ్రీనగర్ డివిజన్లలోని ప్రతి ఇంట్లో బీఆర్ఎస్ జెండా, ఎజెండా చేరేలా నవతారెడ్డి చేస్తున్న ప్రయత్నం అద్భుతంగా ఉందన్నారు. అనంతరం నవతారెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగుతున్నామన్నారు.

Tofa
సోమాజిగూడలోని జయగార్డెన్స్లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేద ముస్లింలకు రంజాన్ రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఫిర్ ఆయేంగే.. జరూర్ తోఫా దియేంగే (మరోసారి అధికారంలోకి వస్తాం.. తప్పకుండా రంజాన్ తోఫా ఇస్తాం) అని ముస్లింలకు భరోసానిచ్చారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ , వెంకట్రామారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ కార్పొరేటర్,
బీఆర్ఎస్ నాయకులు మహేశ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ ప్రసన్నారామ్మూర్తి, బీఆర్ఎస్ నేతలు ఎస్కే అహ్మద్, మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
– ఖైరతాబాద్, మార్చి 12