మేడ్చల్, మార్చి 12 : నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం 60 గజాల స్థలాన్ని ఇచ్చింది. పట్టాను అందుకు న్న దళిత కుటుంబం కష్టపడి కూడబెట్టుకున్న పైసలకు మరికొంత అప్పు చేసి ఇల్లు కట్టుకుంది. ఆ ఇంటిపై కొంత మంది దుండగలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మనుషులమని చెపుతూ దౌర్జన్యానికి దిగారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. బాధితుల తెలిపిన ప్రకారం…మేడిపల్లి రెవె న్యూ పరిధిలోని సర్వే నంబర్ 103లోని 60 గజాల స్థలంలో పట్టా ను అందుకున్న దళిత మహిళ లక్ష్మి కుటుంబం ఇంటి నిర్మాణం చేపట్టింది. గురువారం కొందరు వ్యక్తులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి సామాన్లను బయటకు విసిరేశారు. ఇంట్లో తిష్టవేసి, దావత్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఆ ఇంటి కుటుంబ సభ్యులు.. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్తారని ప్రశ్నించగా కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. దాడి చేసిన వారిలో కొందరు సీఎం పేరుతో, మరికొందరు మంత్రి పొంగులేటి మనుషులమని చెపుతూ గవర్నమెంట్ మాది.. మమ్మల్ని ఎవరేమి ఏం చేస్తారంటూ దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు మేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 103 సర్వే నెంబర్లో తిష్టవేసి, 180 గజాలు స్థలం మాది రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని చెపుతున్నారని తెలిపారు. ఒక కుటుంబానికి ప్రభుత్వం 60 గజాలు మాత్రమే ఇంటి స్థలం కోసం కేటాయించిందని, ఆక్రమణదారులకు 180 గజాలు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. బాధితులు పోలీస్‌లను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతామని, అప్పటి వరకు ఈ స్థలంలో ఎవరూ ఉండకూడదని ఆదేశించారు. పాత మున్సిపాలిటీ కమిషనర్‌కు డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి మరింత రెచ్చిపోతూ తమపై పరుషపదజాలం వాడారని, తమ ఇంట్లో మహిళలను కూడా కులం పే రుతో దూషించారని ఆరోపించారు. దౌర్జన్యం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరారు.