కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 29 : మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చివరి మావోయిస్టు అగ్రనేత బిస్రాతో పాటు మరో నలుగురు అనుచరులను జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిసిర్ బిస్రా అలియాస్ భాస్కర్ అలియాస్ సాగర్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
వామపక్ష ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గిరిధి జిల్లాకు చెందిన బిస్రాను కేంద్ర భద్రతా బలగాలు, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా ధన్బాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు ధ్రువీకరించారు. బిస్రాపై ఇప్పటివరకు పలు రాష్ర్టాల్లో 154 క్రిమినల్ కేసులు, కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.