– వి. రాజేశ్వరి, కరీంనగర్.
వాయవ్యంలో మెట్లు – లిఫ్ట్ నిర్మించుకోవచ్చు. ఇంటికి ఉత్తర – వాయవ్యంలో లిఫ్ట్ పెడితే.. అది బయటినుంచి మాత్రమే అంటే, ఉత్తరం బాల్కనీ నుంచి వాడుకోవాల్సి వస్తుంది. ఉత్తర – వాయవ్యం ఇంటిని కట్‌చేసి, లిఫ్ట్‌ను మధ్యలో పెట్టి, దానిచుట్టూ మెట్లు కట్టుకుంటే.. ఆ మెట్లకు, లిఫ్ట్‌కు తూర్పులో ఒక లాబీ (ప్లేస్) వదిలి, సరిగ్గా లిఫ్ట్‌కు ఎదరుగా ఇంటికి పడమర – వాయవ్యంలో ద్వారం వచ్చేలా ఏర్పాటుచేసుకోవచ్చు. అది కామన్‌గా ఉంటుంది. అయితే, ఆ ఇంటికి ఉత్తరంలో బాల్కనీ ఇచ్చుకోవాలి. అప్పుడు ఇతరులు ఉత్తరం బాల్కనీ నుంచి ఇంటిలోకి ఉత్తర – ఈశాన్యం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటివాళ్లకు ప్రైవసీ కూడా ఉంటుంది. అన్నీ ముందుగా ప్లాన్‌చేసి, తరువాత నిర్మించుకోండి.. వాస్తుదోషం లేకుండా!
– డి. ఆంజనేయులు, కోదాడ.
ఇది చాలా ‘అశుభ గృహం’లా అనిపిస్తున్నది. మీరు మీ ఇంటి నక్ష (ప్లాను) పంపితే బాగుండేది. మీ ఇల్లు ఉత్తరంవైపు, తూర్పు వైపు ఇతరుల ఇంటిని అంటుకొని ఉంది. లేదా తూర్పు – ఉత్తర హద్దుల మీద ఇంటిని నిర్మించారు.. ఖాళీ లేకుండా. ఇది ఇంటి అభివృద్ధిని నిరోధిస్తుంది. ఇంటి యజమానులు, సభ్యుల ఆరోగ్య స్థితిగతులను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. వెంటనే ఆ గృహాన్ని ఖాళీ చేసి, మరొక ఇంటికి మారండి. అది అద్దె ఇల్లు అయినా.. సొంత ఇల్లు అయినా! సొంత ఇల్లు అయితే.. వెంటనే తూర్పు – ఉత్తరం ఖాళీ వచ్చేలా తీసి, కొత్త ఇల్లు కట్టండి. లేదా సరిచేసుకోండి. శారీరక, మానసిక అంధత్వంతో ఆ గృహంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిర్లక్ష్యం వద్దు.
– కె. జానకి, పటాన్చెరువు.
సాధారణ ఇంట్లో కూడా రెండు కిచెన్లు పనికిరావు. వంట గది.. ఇంటి మొత్తానికీ ఒక ప్రాధాన్యత గల స్థానం. దానిని ఎక్కడపడితే అక్కడ ప్యాంట్రీల పేరుతో పెట్టడం సరైంది కాదు. ఇంటిని విభజిస్తే.. రెండు కిచెన్లు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఒక కిచెన్ ఉండాలి. అది ఆగ్నేయం లేదా వాయవ్యంలో.. అంతే! ఆగ్నేయంలోనే రెండు గదులు చేసి, ‘డ్రై కిచెన్ – వెట్ కిచెన్’ అని వాడుకోవచ్చు. అయితే, ఆ రెండు కలిసి ఆగ్నేయ స్థానంలోనే అమరి ఉండాలి. డూప్లెక్స్ ఇల్లు అంటే.. అది ఒక ఇల్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే, పైన కూడా ఒక కిచెన్ అవసరం అనుకుంటే.. కింది కిచెన్ మీదనే ఆగ్నేయంలో అమర్చుకోవచ్చు. కింద వాయవ్యంలో కిచెన్ ఉంటే.. పైన కూడా వాయవ్యంలోనే పెట్టుకోండి.
– ఆర్. కిరణ్ కుమార్, జగిత్యాల.
ఎంత చిన్న ఇల్లు అయినా.. ఎంత పెద్ద ఇల్లు అయినా తూర్పు – ఉత్తరం తప్పకుండా ఖాళీ స్థలం ఉండాల్సిందే! పైగా దక్షిణంలో ఖాళీ స్థలం ఉంది అంటున్నారు. దానివల్ల ఆర్థిక నష్టాలు, స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. దక్షిణం స్త్రీలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీరు వెంటనే ఇంటిని తూర్పు – ఉత్తరం మూడు అడుగుల వరకు కట్‌చేసి, ఓపెన్ చేసినప్పుడే ఇంటికి ఊపిరి ఆడుతుంది. ఉత్తరం కూడా జాగా ఏర్పాటుచేయాలి. దక్షిణ ఖాళీ స్థలాన్ని వాడుకోవాలి అనుకుంటే.. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి, ఇంటిని తొలగించి.. మొత్తం స్థలంలో శాస్త్రబద్ధంగా గొప్పగా ఇల్లు కట్టుకోవచ్చు. ‘మార్పులు అసాధ్యం.. చేయలేం’ అనుకుంటే.. అద్దె ఇంటికి వెళ్లండి. అంతేకాని, అందులోనే ఉండాలని అనుకోకండి. ఇబ్బందులు పడతారు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678