Real Estate | అమెరికాలోనూ రియల్ ఎస్టేట్ కుదేలు.. విక్రయాలు లేక 50 శాతం డిస్కౌంట్లు ప్రకటిస్తున్న రియల్టర్లు
Real Estate | అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొన్న ఇండ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవంతులు, ఆఫీసు స్థలాలు విక్రయాలు లేక ఘోస్ట్ హౌస్‌లుగా మారుతున్నాయి.
Real Estate | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొన్న ఇండ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవంతులు, ఆఫీసు స్థలాలు విక్రయాలు లేక ఘోస్ట్ హౌస్‌లుగా మారుతున్నాయి. అమ్మకాలు భారీగా పతనమవ్వడంతో రియల్టర్లు డిస్కౌంట్ల బాట పడుతున్నారు. 50 శాతం మేర రాయితీ ప్రకటిస్తున్నారు.
రుణాల భారం భరించలేక..
కరోనా సృష్టించిన విలయం అమెరికాపై తీవ్రంగా పడింది. వాణిజ్య కార్యకలాపాలే కాదు రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా గణనీయంగా పడిపోయాయి. అయితే, సంక్షోభం ముగిసిన తర్వాత విక్రయాలు ఊపందుకొంటాయనుకొన్న రియల్టర్ల అంచనాలు తారుమారయ్యాయి. ఆర్థిక సంక్షోభ భయాలు, కరోనా నేర్పించిన ఆరోగ్య సంరక్షణ పాఠాలతో వైద్య ఖర్చులకు బడ్జెట్‌ను పెద్దమొత్తంలో కుటుంబాలు కేటాయించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో ఆఫీసు స్పేస్‌లకు గిరాకీ తగ్గడం వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై పెను ప్రభావం పడింది.
కరోనాకు ముందు బ్యాంకుల నుంచి వడ్డీకి పెద్ద మొత్తంలో రుణాలను తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ భవనాలను నిర్మించాయి. విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంతో బ్యాంకు బకాయిలను చెల్లించాలనుకొన్నాయి. కానీ, కరోనా తర్వాత కొనుగోలుదారుల నుంచి ఆశించిన మేర స్పందన రావట్లేదు. మరోవైపు బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగసాగింది. దీంతో చేసేదేమీ లేక నిర్మాణం ఖర్చుల కంటే తక్కువ మొత్తాలకే విక్రయాలు జరుగుతున్నాయి.
మన్హట్టన్లో ఓ బ్రోకర్ ఓ భారీ భవంతిని 50 శాతం డిస్కౌంట్‌తో ఇటీవల కొనుగోలు చేశాడు. లాస్ఏంజెల్స్లో ఓ బహుళ అంతస్తుల భవనాన్ని ఓ వ్యక్తి పదేండ్ల కిందట కొనుగోలు చేశాడు. గత డిసెంబర్లో దాన్ని కొన్న ధర కంటే 45 శాతం తక్కువకు విక్రయించాడు. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితా పెద్దదే. అమెరికాలోనే కాకుండా జర్మనీ వంటి ఐరోపా దేశాలతో పాటు భారత్‌లోనూ రియల్ ఎస్టేట్ కుదేలవుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్టు నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్ కుదేలుకు ప్రధాన కారణాలు
- ఆర్థిక మాంద్యం భయాలు
- కరోనా సంక్షోభంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబాలు ఎక్కువ బడ్జెట్ కేటాయించడం
- వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరుగడంతో ఆఫీసు స్పేస్‌లకు తగ్గిన గిరాకీ
- డోర్ డెలివరీ సర్వీసుల కారణంగా మాల్స్, రెస్టారెంట్లకు తగ్గిన కస్టమర్ల తాకిడి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

