Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Puducherry | విహారయాత్ర కోసం పుదుచ్చేరి వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు అలల ఉధృతికి కొట్టుకుపోగా.. స్థానిక లైఫ్ గార్డ్స్ అప్రమత్తమై ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Puducherry | విహారయాత్ర కోసం పుదుచ్చేరి వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు అలల ఉధృతికి కొట్టుకుపోగా.. స్థానిక లైఫ్ గార్డ్స్ అప్రమత్తమై ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో విద్యార్థి సముద్రంలో గల్లంతవడంతో అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సముద్రంలో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు ఒక్కసారిగా అలల ఉధృతికి కొట్టుకుపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనను గమనించిన స్థానిక లైఫ్ గార్డ్స్ వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సాహసోపేతంగా సముద్రంలోకి వెళ్లి ఆరుగురు విద్యార్థులను రక్షించారు. మరో విద్యార్థి మాత్రం అలల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు.
ప్రమాదానికి గురైన విద్యార్థులంతా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రక్షించిన ఆరుగురు విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.

Puduchery Accident3

Puduchery Accident2

Puduchery Accident1
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

