Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Koratala Siva | నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కొరటాల శివ, బాలయ్య కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Koratala Siva | నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కొరటాల శివ, బాలయ్య కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇందులో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు? బాలకృష్ణ లుక్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను జనవరి మొదటి వారం నుంచి ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్‌లపై ఆయన కసరత్తు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి బాలయ్య కోసం కొరటాల శివ ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ సిద్ధం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నారనే వార్త కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై గత కొంతకాలంగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా నటి సంయుక్త మీనన్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ‘అఖండ 2’లో బాలకృష్ణతో కలిసి నటించిన సంయుక్త, మరోసారి ఆయనతో జతకడితే ఈ కాంబినేషన్‌పై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. సంయుక్త మీనన్ తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. ఈ సినిమా కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా కుటుంబ భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ‘దేవర’ తర్వాత కొరటాల శివ తెరకెక్కించనున్న సినిమా కావడంతో కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్ఫుల్ అంశాలతో పాటు భావోద్వేగాలను కూడా సమపాళ్లలో మేళవించేలా కథను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

