కారణాలివే..
అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలు గడిచిన పదేండ్లుగా అక్కడి టెక్ నిపుణులనే ఉద్యోగులుగా చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆటోమేషన్, ఏఐ వాడకం పెరిగింది. ఉద్యోగుల జీవన వ్యయానికి ఎక్కువ మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. వెరసి హెచ్-1బీ వీసా దరఖాస్తులను కంపెనీలు తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.