Man on Baffalo : జీవితంలో తొలి ఓటు వేసిన ఓ యువకుడు ఆ సందర్భం ఎప్పటికీ గుర్తుండాలని వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. బీహార్ రాష్ట్రంలోని ఉజియార్పూర్ లోక్సభ స్థానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమస్తిపూర్ జిల్లాలోని ఉజియార్పూర్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన యువకుడికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. దాంతో తన తొలి వేటు ఎప్పటికీ గుర్తుండాలని వినూత్నంగా ఆలోచించాడు. నల్ల చొక్కా, గ్రే కలర్ ప్యాంట్ ధరించి, తలకు ఆకుపచ్చ తలపాగా చుట్టి దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశాడు.
దున్నపోతుకు తలకు కూడా ఆకుపచ్చ తలపాగా చుట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కింది వీడియోలో ఆ ఓటర్ దున్నపోతుపై ఊరేగిన దృశ్యాలను మీరు కూడా చూడవచ్చు.
#Watch: It Was His First Vote. So He Rode A Buffalo To Polling Station#ElectionsWithNDTV #Bihar pic.twitter.com/w482IhHQpi
— NDTV (@ndtv) May 13, 2024