కిర్గిజ్‌స్థాన్‌లో భారత విద్యార్థులపై దాడులు
కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్లో భారత్, పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. స్థానికులు వైద్య కళాశాలల హాస్టళ్లపై హింసాత్మకంగా విరుచుకుపడటంతో ముగ్గురు పాక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భారత విద్యార్థులతో సహా మరికొందరు గాయపడినట్టు తెలుస్తున్నది.
బిష్కెక్: కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్లో భారత్, పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. స్థానికులు వైద్య కళాశాలల హాస్టళ్లపై హింసాత్మకంగా విరుచుకుపడటంతో ముగ్గురు పాక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భారత విద్యార్థులతో సహా మరికొందరు గాయపడినట్టు తెలుస్తున్నది. ఓ హాస్టల్ వద్ద పాక్, ఈజిప్ట్ సహా ఇతర దేశాల విద్యార్థులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణ ఈ పరిస్థితికి దారి తీసినట్లు సమాచారం.
దీంతో బిష్కెక్ నగర వీధుల్లోనూ ఘర్షణలు జరిగాయి. విదేశీయుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరే వరకు విద్యార్థులు హాస్టళ్లలోనే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తమను సంప్రదించాలని భారత్ ఎంబసీ భారతీయులను కోరింది. ఫోన్ నంబరును ట్వీట్ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

