SRH vs LSG | హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ కాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన లఖ్నవూ.. బ్యాటింగ్ ఎంచుకుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్ల్లో కనీసం రెండు గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకునే అవకాశం ఉంది.