Chops Off Tongue: నాలుక కోసుకుని దేవుడికి సమర్పించాడు.. ఎందుకలా చేశాడు ?
Chops Off Tongue: చత్తీస్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన నాలుకను కోసేసుకున్నాడు. ఆ కోసిన నాలుకను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో జరిగింది. ఇవాళ ఉదయం తనౌడ్ గ్రామం.. అంజోరా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
దుర్గ్: చత్తీస్‌ఘడ్‌లో విచిత్ర ఘటన జరిగింది. 33 ఏళ్ల ఓ వ్యక్తి తన నాలుకను కోసేసుకున్నాడు(Chops Off Tongue). ఆ కోసిన నాలుకను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో ఇవాళ ఉదయం తనౌడ్ గ్రామం.. అంజోరా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాజేశ్వర్ నిషాద్ అనే వ్యక్తి గ్రామంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి, కొన్ని మంత్రాలు వల్లించి, తన నాలుకను కత్తితో తానే కోసుకున్నాడు. ఆ చెరువు వద్ద ఉన్న ఓ రాయిపై ఆ కోసిన నాలుకను ఉంచాడు. రక్తం బ్లీడింగ్‌తో ఉన్న అతన్ని గ్రామస్తులు చూసి అంబులెన్స్‌కు కాల్ చేశారు. జిల్లా ఆస్పత్రికి అతన్ని షిఫ్ట్ చేశారు.
గ్రామస్థుల కథనం ప్రకారం.. నిషాద్ భార్య మూగది. ఆమెకు మాటలు రావు. అయితే ఏదో కోరికతో శివుడికి అతను తన నాలుకను సమర్పించినట్లు అనుమానిస్తున్నారు. కానీ నాలుక కోసుకోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియదు. నిషాద్ వాడిన కత్తిని పోలీసులు రికవరీ చేశారు. ఇదో మూఢనమ్మకానికి చెందిన ఘటన అని, విచారణలో మరిన్ని విషయాలు తెలియనున్నట్లు పోలీసులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

