Hero MotoCorp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సంస్థ (2021-22)తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చి త్రైమాసికం నికర లాభాలు 18 శాతం పెంచుకున్నది. 2021-22 మార్చి త్రైమాసికంలో నికర లాభం రూ.858.93 కోట్ల నికర లాభం గడిస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1016.05 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి తన వాటాదారులకు ఒక్కో షేర్ పై హీరో మోటో కార్ప్స్ రూ.40 డివిడెండ్ ప్రకటించింది. హీరో మోటో కార్ప్స్ ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత స్టాక్ మార్కెట్లలో సంస్థ షేర్ నాలుగు శాతం పుంజుకుని రూ.4600 మార్కును దాటేసింది.
ప్రీమియం, 125సీసీ స్కూటర్లు, మోటారు సైకిళ్ల ఆవిష్కరణ నేపథ్యంలో 2023-24లో టూ వీలర్స్ మార్కెట్ షేర్ పెంచుకుంటుందని హీరో మోటో కార్ప్ తెలిపింది. జూమ్ 125 సీసీ, జూమ్ 160 సీసీ స్కూటర్ల ఆవిష్కరించనున్నది. వచ్చే ఏడాది మధ్య శ్రేణి, చౌక శ్రేణి ఈవీ లను ఆవిష్కరించనున్నది. ప్రస్తుతం విదా ఈవీని మాత్రమే మార్కెట్లో విక్రయిస్తున్నది. గత మార్చి త్రైమాసికంలో 13.92 లక్షల మోటారు సైకిళ్లు, స్కూటర్లు విక్రయించింది. 2022-23లో 12.70 లక్షల యూనిట్లు మాత్రమే విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో 56.21 లక్షల వాహనాలు విక్రయిస్తే, 2022-23లో 53.29 లక్షలు విక్రయించింది.