Kia EV3 | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా కార్పొరేషన్ తన కియా ఈవీ3 కంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును ఈ నెల 23న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది. ‘ఆపోజిట్స్ యునైటెడ్’ ఫిలాసఫీ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘కియా ఈవీ3’ ఉత్పత్తి దశలో ఉన్నది. ఈవీ3తో అత్యంత చౌక ధరకు మాస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించడంతోపాటు ప్రీమియం ఈవీ6, ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లను కూడా మార్కెట్లోకి తీసుకు రానున్నది.
కియా ఈవీ3 కార్లు ఎక్స్టీరియర్గా బోల్డ్, జియో మెట్రిక్ అంశాలుంటాయి. బాక్సీ రేర్ ఫెండర్స్, టెయిల్ గేట్, వెహికల్ సిగ్నేచర్ స్టార్ మ్యాప్ లైటింగ్ వంటి ఫీచర్లు జత చేస్తున్నారని సమాచారం. కియా తన ఫ్లాగ్ షిప్ కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆధారంగానే కియా ఈవీ3 డిజైన్ ఉంటుంది. కియా ఈవీ3 కారు భారత్ మార్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ ఆవిష్కరించవచ్చు.