Swayambhu Movie | టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్తా మేనన్, నభా నటేష్ కథనాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం సంయుక్తా మేనన్ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటుంది. ఇప్పటికే సినిమా నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్‌తో పాటు సంయుక్తా మేనన్, నభా నటేష్ లుక్‌లను విడుదల చేయగా నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ పోస్టర్లో కదనరంగంలోకి దూకిన ఓ యోధుడిగా నిఖిల్ కనిపిస్తున్నాడు. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. స్వయంభు చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Nikhil – #Swayambhu – New Poster pic.twitter.com/jzTz0EjGQV
— Aakashavaani (@TheAakashavaani) May 7, 2024