హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికగా నేడ సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) – లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్(IPL match) సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు(Metro Rail) సమయం పొడిగించారు. మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయన్నారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుంది అని మెట్రో అధికారులు వెల్లడించారు.