AstraZeneca: మార్కెట్ల నుంచి కోవిడ్ టీకాను వెనక్కి రప్పిస్తున్న ఆస్ట్రాజెనికా
AstraZeneca: ఆస్ట్రాజెనికా కంపెనీ తన కోవిడ్ టీకాను ప్రపంచ మార్కెట్ల నుంచి వెనక్కి రప్పిస్తున్నది. ఆ టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు కోర్టులో రుజువు కావడంతో బ్రిటీష్ కంపెనీ తన ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నది. ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఈ టీకాను తయారు చేశారు. ఇండియాలో ఆ టీకాను కోవీషీల్డ్ పేరుతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
లండన్: ఆస్ట్రాజెనికా(AstraZeneca) కంపెనీ తన కోవిడ్ టీకాను ప్రపంచ మార్కెట్ల నుంచి వెనక్కి రప్పిస్తున్నది. ఆ టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు కోర్టులో రుజువు కావడంతో బ్రిటీష్ కంపెనీ తన ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నది. ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఈ టీకాను తయారు చేశారు. అయితే ఇండియాలో ఆ టీకాను కోవీషీల్డ్ పేరుతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం మార్కెట్లో కోవిడ్19కు చెందిన అప్డేటెడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, వాణిజ్య కారణాల దృష్ట్యా తమ టీకాను మార్కెట్ల నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ తెలిపింది. కొత్త వేరియంట్లను నియంత్రించగల కొత్త వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చేశాయని, అందుకే ఆ టీకాను మార్కెట్ల నుంచి విత్‌డ్రా చేస్తున్నట్లు ఓ మీడియాలో వెల్లడించారు.
యురోపియన్ యూనియన్‌లో ఈ టీకాను ఉత్పత్తి చేయడం లేదని, దీన్ని ఇక ముందు వాడబోమని కూడా కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ వాడుతున్నట్లు అన్ని దేశాల నుంచి టీకాలను వెనక్కి రప్పించనున్నట్లు తెలిపారు. కోవిడ్ టీకా వల్ల అనేక మంది మరణించారని ఆస్ట్రాజెనికా కంపెనీపై బ్రిటన్ కోర్టులో కేసులు ఉన్నాయి. ఆ కంపెనీపై వంద మిలియన్ల పౌండ్ల పరువునష్టం కేసు కూడా ఉన్నది.
కోవీషీల్డ్ టీకా వల్ల కొన్ని అరుదైన కేసుల్లో థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ కోర్టులో అంగీకరించింది. టీటీఎస్ వల్ల రక్తం గడ్డకడుతుంది. బ్లడ్ ప్లేట్లెట్ల కౌంట్ కూడా తగ్గుతుంది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో సుమారు 81 మంది మరణించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వాడడం వల్ల తొలి సంవత్సరం సుమారు 65 లక్షల మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మందికి టీకా డోసులను సరఫరా చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

