Maruti Swift | 9న ఫోర్త్ జెన్ మారుతి స్విఫ్ట్ ఆవిష్కరణ.. ఇవీ ఫీచర్లు..?!
Maruti Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Maruti Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ కారు పట్ల ఆసక్తి గల వారు రూ.11 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. నెల రోజుల్లోపు డెలివరీ అవుతుంది. ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారు ప్రస్తుతం స్విఫ్ట్‌లో వాడుతున్న ఇంజిన్‌కు బదులు జడ్-సిరీస్ 1.2 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. కొత్త ఇంజిన్ లీటర్ పెట్రోల్ మీద సుమారు 40 కి.మీ మైలేజీ ఇస్తుంది.
6-ఎయిర్ బ్యాగ్స్‌తోపాటు అడాస్ తరహా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారు వస్తోంది. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఆటోమోటార్ షోలో మారుతి సుజుకి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్.. ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. ప్రస్తుత మోడల్ స్విఫ్ట్ కారు ధర రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త ఫీచర్లు, డిజైన్‌తో తాజా ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారు ధర రూ.6.3 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతుంది. భారత్ మార్కెట్లో హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో వంటి కార్లతో పోటీ పడుతుంది.
నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ కారు ఫ్రంట్‌లో ప్రొజెక్టర్ సెటప్తోపాటు హెడ్ ల్యాంప్స్ షార్ప్ లుకింగ్‌తో ఉంటాయి. ఇన్ బిల్ట్ ఎల్ఈడీ డేటైం రన్నింగ్ ల్యాంప్స్, రెండు హెడ్ ల్యాంప్స్ మధ్య డార్క్ క్రోమ్ ఫినిష్‌తోపాటు రీ డిజైన్డ్ హానీ కోంబ్ ప్యాటర్న్ బ్లాక్ గ్రిల్లె ఉంటాయి. హియర్ టెక్ ప్లాట్ ఫామ్ ఆధారంగా న్యూ జెన్ స్విఫ్ట్ రూపుదిద్దుకున్నది. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మినహా సైడ్ ప్రొపైల్‌లో ఎటువంటి మార్పు లేదు.
ఫోర్డ్ ఫిగో, మారుతి బాలెనో, మారుతి బ్రెజా కార్లలో మాదిరిగా మారుతి సుజుకి న్యూ జెన్ ‘స్విఫ్ట్’ ఆల్ న్యూ డాష్ బోర్డ్ లేఔట్ విత్ బ్లాక్ అండ్ వైట్ డ్యుయల్ టోన్ థీమ్‌తో వస్తుంది. స్లీక్ ఏసీ వెంట్స్, హెచ్ వీఏసీ కంట్రోల్స్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు జత చేశారు.
న్యూ జడ్-సిరీస్ స్విఫ్ట్ కారులో కే12 ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ స్థానే న్యూ 1.2 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 90 హెచ్‌పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సీఎన్జీ, హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్లు కూడా ఉంటాయని తెలుస్తున్నది. 360-డిగ్రీ కెమెరా, డ్యుయల్ సెన్సర్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, కొల్లిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

