సోమవారం 18 జనవరి 2021
Vikarabad - Nov 26, 2020 , 03:54:46

తాండూరులో ఎల్‌ఈడీ వెలుగులు

తాండూరులో ఎల్‌ఈడీ వెలుగులు

తాండూరు: ఇప్పుడు తాండూరులో వెలుగులు పూసి అందాల హరివిల్లులా తయారు కాబోతున్నది. పట్టణంలోని ప్రధాన రోడ్లుతో పాటు కాలనీల్లో ఎక్కడ చూసినా ఎల్‌ఈడీ లైట్లతో రాత్రి కూడా పగలులా కనిపిస్తున్నది. ముఖ్యంగా రూ.1.12 కోట్లతో తాండూరు-ఖాంజాపూర్‌ వరకు డివైడర్‌ మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌కు 2019 నవంబర్‌లో మంత్రి సబితారెడ్డి, ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో పనుల్లో ఆలస్యం జరుగకుండా ఎమ్మెల్యే కృషితో హైదరాబాద్‌ ప్రధాన మార్గంలో 5 కిలోమీటర్ల దూరం (తాండూరు-ఖాంజాపూర్‌ గేట్‌) వరకు సెంట్ర ల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేయడంతో వెలుగులు విరాజిల్లుతూ ప్రజలను ఆకర్శిస్తున్నా యి. రాత్రులు కూడా ప్రజలు వాకింగ్‌ వెళ్తూ ఆహ్లాదాన్ని పంచుకుంటున్నారు. డివైడర్లపై నాటిన మొక్కలు ఏపుగా ఎదిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

సమస్యలను మా దృష్టికి తీసుకు రావాలి

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతు బంధు, రైతుబీమా, ధరణి పోర్టల్‌, పల్లె, పట్టణ ప్రణాళికలు చరిత్రలో నిలిచిపోతాయి. మురుగు కాల్వలు, వీధి దీపాలు, రోడ్ల  పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. పట్టణం లో ఎక్కడ సమస్యలు ఉన్న వెం టనే మా దృష్టికి తీసుకు రావాలి.  - స్వప్న, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌