సమ్మతి పత్రాలు ఇచ్చిన వారికే అనుమతి

- ప్రతి పాఠశాలలో శానిటైజేషన్
- మధ్యాహ్న భోజనం తయారీకి ఏర్పాట్లు
- డీఈవో అబ్దుల్‌హై
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 31 (నమస్తేతెలంగాణ): సుమారు 10 నెలల విరామం తరువాత పాఠశాలలు సోమవారం నుంచి పునః ప్రారంభిస్తున్నాయి. జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఉన్న 69 ఉన్నత పాఠశాలల్లోని 9, 10 తరగతులు, 6 మోడల్‌స్కూల్స్, 11 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా డీఈవో అబ్దుల్‌హై తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 86 పాఠశాలలను శానిటైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాలను అందించిన విద్యార్థులను మాత్రమే పాఠశాలలకు అనుమతించనున్నట్లు డీఈవో వెల్లడించారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించే నిబంధన పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులకు తాగు నీరు, విద్యుత్ వంటి వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట డిప్యూటేషన్‌పై పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన చోట ప్రభుత్వ అనుమతితో విద్యా వలంటీర్ల నియామకానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 9వ తరగతిలో 3774 మంది, 10వ తరగతిలో 3891 మంది, మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లోని ఇంటర్ మొదటి సంవత్సరంలో 786 మంది, రెండో సంవత్సరంలో 837 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- బ్లాక్ చెయిన్ తంటా.. పేమెంట్స్ సందేశాలకు తీవ్ర అంతరాయం
- నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తెలిసి షాకయ్యా: రాజేంద్రప్రసాద్
- స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
- ‘జాతి రత్నాలు’ బిజినెస్ అదుర్స్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్