Pesticides | పంటల సాగులో రసాయనాలు.. ఆరోగ్యానికి హానికరం
పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారం అందించే క్రమంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు నాశనుల వాడకం పెరిగింది. పంటల దిగుబడులు బాగా పెరిగి ఆహార భద్రత సమకూరినప్పటికీ, ఇలాంటి ఆహారం వల్ల ఎనిమిది రకాలైన ప్రమాదకర రసాయనాలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Pesticides | పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారం అందించే క్రమంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు నాశనుల వాడకం పెరిగింది. పంటల దిగుబడులు బాగా పెరిగి ఆహార భద్రత సమకూరినప్పటికీ, ఇలాంటి ఆహారం వల్ల ఎనిమిది రకాలైన ప్రమాదకర రసాయనాలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పంటలు, కూరగాయలు, పండ్లతోటల్లో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు మోనోక్రోటోఫాస్, ఆక్సిడెమెటాన్మిథైల్, ఏసిఫేట్, ప్రొఫెనోఫాస్, ఎలక్లార్, క్లోరోథాలోనిల్, మిథోమైల్, ైగ్లెఫోసేట్ లాంటి క్రిమి సంహారకాలు, శిలీంధ్ర నాశకాలు, కలుపు నాశనులను పిచికారీ చేస్తారు. వీటిలో ఉండే హానికరమైన రసాయనాల వల్ల శ్వాస సమస్యలు, నాడీకణాలు ధ్వంసం కావడం, చర్మ సమస్యలు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు, క్యాన్సర్లు అభివృద్ధి చెందడంలాంటి విపరిణామాలు సంభవిస్తాయి.
కాబట్టి, మన ఆరోగ్య సంరక్షణ కోసం తినే ఆహార పదార్థాల్లో దాగి ఉన్న ఈ రసాయనాల గురించి తెలుసుకుని ఉండాలి. మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవడం, పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినడం, సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించడం మొదలైన చర్యల ద్వారా హానికరమైన రసాయనాల ప్రభావాన్ని తప్పించుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

