MLA Prakash Goud | నా తండ్రి నుంచి ప్రాణహాని ఉంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడి సంచలన ఆరోపణలు.. వీడియో
MLA Prakash Goud | తన తండ్రి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్‌గౌడ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.
MLA Prakash Goud | ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యాడని కన్న కొడుకుపైనే రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దాడి చేయించడం కలకలం రేపుతోంది. ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నందుకు తన తండ్రి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడే స్వయంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి నుండి నాకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
నేను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అబ్బాయిని.. శ్రేయాషి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. జులై 8న మాకు నిశ్చితార్థం కూడా అయింది. ఇదంతా మా తల్లిదండ్రులకు తెలుసు. వాళ్లంతా ఒప్పుకున్నరు. వాళ్లు సొంతంగా ప్రేమ పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదు.. కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లికి అనుమతిస్తున్నామని చెప్పారు. దీంతో మా అత్తమ్మవాళ్లతో కలిసి నిశ్చితార్థం పూర్తి చేసుకున్నాం. నేను ఇప్పటికే నెల రోజుల నుంచి వీళ్ల ఇంట్లోనే ఉంటున్నానని మా ఇంట్లో కూడా తెలుసు. కానీ నిన్న 40 మంది దాకా వచ్చి అత్తమ్మవాళ్లింటిపై దాడి చేశారు. వాళ్లు దాడి చేసినందుకు సాక్ష్యాధారాలు కూడా ఇక్కడున్నాయి. ఇదంతా కేవలం అమ్మాయి విషయం వల్ల జరుగుతుంది. నెల అవుతుంది.. నేను ఇక్కడున్నా అని వాళ్లకు తెల్వదా.. నేను పెళ్లి చేసుకునేది తెల్వదా..? వాళ్లకు ప్రతీ ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులుగా లేనిది ఇవాళ ఎవరో అప్పులివ్వాలని అందరితో పిటిషన్లను ఇచ్చి ఇంటి ఆడవాళ్ల మీద దాడి చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు.
తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలో తాను ప్రేమించిన యువతి ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించి, తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని సంతోష్ గౌడ్ ఆరోపించాడు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన కొడుకు మీద దాడి చేయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నా తండ్రి నుండి నాకు ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు సంచలన ఆరోపణలు
తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలో… pic.twitter.com/n9iUBy2PqI
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
Read Also :
Anushka Shetty | అనుష్క కోసం రాసిన కథ.. 12 ఏళ్ల తర్వాత ‘కింగ్ జాకీ క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు..
Footballer | మ్యాచ్ ఆడుతుండగా ఫుట్‌బాలర్‌పై పిడుగు.. అక్కడికక్కడే దుర్మరణం..!
Pradeep Rawat | చివరి క్షణాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమైన ప్రదీప్ రావత్ కుమారుడు.. అంతా నెలన్నరలోనే జరిగిపోయింది..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

