‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా’.. పెంపుడు కుక్కకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
వరంగల్ జిల్లా రంగశాయిపేటలో దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘దేవుడా.. మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు’ అంటూ వారు రాసిన సూసైడ్ నోట్ స్థానికంగా కలకలం రేపింది.
రెక్కల కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆ దంపతులను అనారోగ్య సమస్యలు, అప్పుల భారం కుంగదీశాయి. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోవడం, అప్పు ఇచ్చినవారి నుంచి అవమానాలు ఎదురవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చివరకు జీవితంపై ఆశలు కోల్పోయి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లా రంగశాయిపేటలో చోటుచేసుకుంది. ‘దేవుడా.. మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు’ అంటూ వారు రాసిన సూసైడ్ నోట్ స్థానికంగా కలకలం రేపింది.
రంగశాయిపేట పరిధిలోని ఎస్బీఐ బ్యాంకు వీధిలో ఓ అద్దె ఇంట్లో నల్లపోగుల సంజయ్‌కుమార్ (60), ఆయన భార్య శోభ (53) నివసిస్తున్నారు. సంజయ్‌కుమార్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. శోభ టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నది. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరికీ వివాహాలు కాగా.. ఉపాధి నిమిత్తం ముంబయిలో ఉంటున్నారు. దంపతులు తమ కష్టార్జితంతోనే జీవనం సాగిస్తున్నారు. వయసు మీద పడటంతో ఎదురైన అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు తోడయ్యాయి. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడం భారంగా మారింది. అనారోగ్యం కారణంగా సమయానికి వడ్డీలు చెల్లించలేకపోవడంతో అప్పు ఇచ్చినవారి నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన వారు సోమవారం అర్ధరాత్రి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
మీకే తిండికి దిక్కులేదు.. పెంపుడు కుక్క అవసరమా?
ఆత్మహత్యకు ముందు దంపతులు రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు అందర్నీ కలిచివేస్తుంది. అప్పులు ఇచ్చినవారు తమను అసభ్యంగా దూషించారని, అవమానకరంగా మాట్లాడారని దంపతులు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. ‘మీకే తిండికి దిక్కులేదు.. పెంపుడు కుక్క అవసరమా?’ అంటూ అవమానించారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వారానికి ఒకసారి వడ్డీలు చెల్లిస్తున్నప్పటికీ చక్రవడ్డీల పేరుతో వేధించారని, అప్పులు తిరిగి చెల్లించకపోతే గొడవ చేసి పరువు తీస్తామని బెదిరించారని నోట్లో రాశారు. ‘అప్పు ఇచ్చినవారి అవమానాలు తట్టుకోలేకపోతున్నాం. మా కుమారులకు భారం కావొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మాకు సొంత ఇల్లు కూడా లేదు. మా అవయవాలను దానం చేయండి. ఏళ్లుగా మాతో కలిసి జీవించిన పెంపుడు శునకానికి కూడా మాతోపాటే అంత్యక్రియలు నిర్వహించండి. దేవుడా.. మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు’ అంటూ వారు నోట్లో పేర్కొన్నారు. ఈ సూసైడ్ నోట్ స్థానికంగా అందర్నీ కలిచివేస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా’.. పెంపుడు కుక్కకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
Tharun Bhascker | నా కొడుకుకి ఒకరున్నారనే ధైర్యం వచ్చింది.. తరుణ్-ఈషా రిలేషన్‌పై తల్లి గీతా భాస్కర్ భావోద్వేగం!
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
Lateef Bhat: మసీదులో దాక్కున్న లతీఫ్ భట్.. కుల్గాం ఎన్కౌంటర్లో హతం
Cyclone Akvan | ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. తీవ్ర తుపానుగా బలపడిన వాయుగుండం!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

