Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపి అదృశ్యమయ్యాడు. ‘నాకు ఈ బతుకు బతకాలని లేదు.. మీరైనా సంతోషంగా ఉండండి’ అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన అతడు స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లాడు.
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపి అదృశ్యమయ్యాడు. ‘నాకు ఈ బతుకు బతకాలని లేదు.. మీరైనా సంతోషంగా ఉండండి’ అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన అతడు స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోవడం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామంలో కలవరం రేపింది.
మోతీఘనపూర్ గ్రామానికి చెందిన శివప్రసాద్ (23) తన భార్య తరచూ గొడవలు పడుతూ తనను కొడుతోందని, బూతులు తిడుతూ అవమానిస్తోందని వీడియోలో తెలిపాడు. పెద్ద మనుషుల ముందు కూడా తననే తప్పుగా చిత్రీకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆడవారివైపే చట్టాలు ఉన్నాయనే ధైర్యంతో తనను ఇబ్బందులకు గురిచేస్తోందని, కొడుతూ, కొరుకుతూ వేధిస్తోందని పేర్కొన్నాడు.
తనను మానసికంగా కుంగదీసి, చనిపోమని అంటోందని వీడియోలో శివప్రసాద్ వాపోయాడు. ఈ జీవితం తనకు వద్దని, తల్లిదండ్రులైనా సంతోషంగా ఉండాలని చెబుతూ ఇంటి నుంచి స్కూటీపై హైదరాబాద్ వైపు బయలుదేరాడు. అయితే కొత్తూరు వద్ద తన స్కూటీని నిలిపివేసి అతడు కనిపించకుండా పోయినట్లు సమాచారం. శివప్రసాద్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.
“నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు”
తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడి అదృశ్యం
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామంలో తన భార్య తనను తరచూ వేధిస్తోందని, కొడుతూ, బూతులు తిడుతూ అవమానిస్తుందని ఆవేదనతో వీడియో తీసి అదృశ్యమైన శివప్రసాద్ (23) అనే యువకుడు
తరచూ గొడవలు పెట్టుకుని, పెద్ద మనుషుల ముందు తననే తప్పుగా చిత్రీకరిస్తుందని ఆవేదన
ఆడవారివైపే చట్టాలు ఉన్నాయని అదునుగా చేసుకుని తనతో ఆడుకుంటుందని, కొడుతూ, కొరుకుతూ, పిచ్చిపట్టినట్టు చేసి చనిపోమని అంటుందని ఆందోళన
“నాకు ఈ బతుకు బతకాలని లేదు, మీరైనా సంతోషంగా ఉండండి” అంటూ తల్లిదండ్రులకు తెలిపి స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లిన శివప్రసాద్
కొత్తూరు వద్ద స్కూటీ నిలిపి అదృశ్యమయ్యాడని, శివప్రసాద్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
Lateef Bhat: మసీదులో దాక్కున్న లతీఫ్ భట్.. కుల్గాం ఎన్కౌంటర్లో హతం
Cyclone Akvan | ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. తీవ్ర తుపానుగా బలపడిన వాయుగుండం!
Russian Plane Crash | రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 19 మంది మృతి!
Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో రాముడున్నాడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం నేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

