హనుమకొండ చౌరస్తా : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ( Jayashankar ) గొప్ప పరిపాలన దక్షుడు, తెలంగాణ సాధనకు జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహానీయుడని కేయూ రిజిస్ట్రార్ (KU Registrar ) ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ( Ramachandram ) అన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆడిటోరియం ప్రాంగణంలోని బీసీ సెల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాంచంద్రం మాట్లాడుతూ జయశంకర్ ప్రతి ప్రసంగం వాస్తవాలు, గణాంకాలతో కూడినదని, నిబద్ధతకు ఆయన నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి, కంట్రోలర్ కట్ల రాజేందర్, పి.కరుణాకర్, ఎం.లింగయ్య, పుల్లా శ్రీనివాస్, సంగాల మల్లేశ్వర్, ఆర్.కృష్ణయ్య, తిరునహరి శేషు, ఈసం నారాయణ, పాలక మండలి సభ్యురాలు అనితారెడ్డి, రమ, చిర్రా రాజు, బి.సురేష్లాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.